కిరాక్ బ్యూటీ కిరాక్ గా ఉందే..

‘కిరాక్ పార్టీ’ చిత్రంతో టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచమైన బెంగుళూరు బ్యూటీ సంయుక్త హెగ్డే..టాలీవుడ్ ఇండస్ట్రీ లో రాణిద్దామని గట్టి ఆశలే పెట్టుకుంది కానీ కిరాక్ పార్టీ కిరాక్ అనిపించుకోలేకపోవడం తో అమ్మడికి మరో ఛాన్స్ రాకుండా పోయింది. అయినప్పటికీ సోషల్ మీడియా లో మాత్రం అందాల ఆరబోత చేస్తూ తన సత్తా చాటుతుంది.

తాజాగా ఈ భామ తన ఇన్స్టా ఖాతా ద్వారా ఒక బికినీ ఫోటో పోస్ట్ చేసింది. ఈ బికినీ పోజ్ కు “మీరు ఏది చూస్తారనేది మీగురించి తెలుపుతుంది అది నేను కాదు. అవును.. ఈ ఫోటో చాలా నైస్ గా ఉంది. క్రిస్ థ్యాంక్ యూ” అంటూ క్యాప్షన్ ఇచ్చింది. పింక్ కలర్ బికినీ.. చాకొలేట్ లా ఉన్న మేనిరంగు.. ఆకట్టుకునే ఒంపుసొంపులతో కిరాక్ గా ఉంది. అమ్మడి బ్యాక్ గ్రౌండ్ లొకేషన్ కూడా అదిరింది.. పచ్చటి చెట్లు.. స్వచ్చంగా అడుగున నేల కనిపిస్తున్న నీటి వాగు.. ఆ పైన బోటు.. దానిపైన హాటు..ఓవరాల్ సంయుక్త అందర్నీ టెంప్ట్ చేసింది.