కోడిరామకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమం..ఆందోళనలో సినీ ప్రముఖులు..

సీనియర్ డైరెక్టర్ కోడిరామకృష్ణ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన గచ్చిబౌలి లోని ఏఐజి హాస్పిటల్ లో వెంటిలేటర్ మీద ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులంతా హాస్పటల్ కు క్యూ కడుతున్నారు. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని హాస్పటల్ వైపు పరుగులు పెడుతున్నారు.

1982 లో చిరంజీవి తో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా చేసి డైరెక్టర్ గా ఇండస్ట్రీ కి పరిచయమయ్యాడు. చిరంజీవితో ఇంట్లోరామయ్య వీధిలో కృష్ణయ్య తర్వాత ఆలయశిఖరం(అమితాబ్ నటించిన ఖుద్దార్ చిత్రం ఆధారంగా), సింహపురిసింహం(చిరంజీవి ద్విపాత్రాభినయం), గూఢచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాలు నిర్మించారు. బాలకృష్ణకు సోలో హీరోగా తొలి విజయవంతమైన చిత్రం “మంగమ్మగారి మనవడు” ఈయన చిత్రమే. తర్వాత బాలకృష్ణతో ముద్దుల కృష్ణయ్య, ముద్దులమావయ్య, మువ్వగోపాలుడు, ముద్దుల మేనల్లుడు, బాలగోపాలుడు వంటి చిత్రాలు తీసారు. భార్గవ్ ఆర్ట్స్ చిత్రాలలో ఎక్కువభాగం కోడి దర్శకత్వం వహించారు.

గొల్లపూడి మారుతీరావు, గణేష్ పాత్రో మాటలతో కోస్తాంధ్ర నేపథ్యంతో కొంతకాలం చిత్రాలు తీశారు. ఆ తర్వాత గ్రాఫికల్ చిత్రాలు అమ్మోరు, దేవి, దేవీపుత్రుడు, దేవుళ్ళు, అంజి , అరుంధతి వంటి సినిమాలు చేసారు. చివరిగా అవతారం చిత్రాన్ని తెరకెక్కించారు

ఇంత గొప్ప డైరెక్టర్ త్వరగా కోలుకోవాలని అందరూ కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.