సంక్రాంతి బరిలో ‘క్రాక్ ..లవ్ స్టోరీ’

సమ్మర్ లో రిలీజ్ కావాల్సిన చిత్రాలు కరోనా దెబ్బకు సంక్రాంతికి వెళ్లిపోతున్నాయి. గత ఆరు నెలలుగా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ లు బంద్ అయ్యాయి. తాజాగా కేంద్రం షూటింగ్ లకు అనుమతి ఇవ్వడం మళ్లీ బిజీ అయ్యారు.

ఈ నేపథ్యంలో రవితేజ క్రాక్ , నాగ చైతన్య లవ్ స్టోరీ చిత్రాలను ౨౦౨౧ సంక్రాంతి బరిలో దింపేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రెండు సినిమాల షూటింగ్ 90 % పూర్తి అయ్యాయి. మిగిలిన పది శాతాన్ని సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేయాలనీ అనుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెండు చిత్రాల షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యాయి. మరి సంక్రాంతి బరిలో ఈ రెండేనా ..ఇంకేమైనా కలుస్తాయా అనేది చూడాలి.