ప్రభాస్ కు నారా లోకేష్ విషెష్..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా ఆయనకు అభిమానులు , సినీ ప్రముఖులే కాదు రాజకీయ నేతలు సైతం బర్త్ డే విషెష్ తెలిపి ఆనందపరుస్తున్నారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రభాస్‌ కు ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. “బాహుబలితో తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి చేర్చిన ప్రభాస్ కి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మరిన్ని మంచి చిత్రాలలో నటించి, ప్రజలని ఆనందపరచాలని కోరుకుంటున్నానని’ లోకేష్ ట్వీట్ చేశారు.

ప్రభాస్ తన 40 వ పుట్టినరోజును లండన్ లో చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ సన్నిహితులు మరియు బాహుబలి టీమ్ అందరూ లండన్‌ కి వెళ్లారు. వారితో కలిసి ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకోనున్నారు.