విజయ్ దేవరకొండ అభిమానుల మీద లాఠీఛార్జ్ !

నక్క తోక గానీ తొక్కి ఇండస్ట్రీకి వచ్చాడేమో కానీ ప్రస్తుతం విజ‌య్ దేవ‌ర‌కొండకు ఇప్పుడున్న క్రేజ్ వర్ణనాతీతం. తెలుగులోనే కాక మిగిలిన భాష‌ల్లో కూడా ఈ హీరోకు ఇప్పుడు అభిమానులు ఏర్పడ్డారు. ప‌ట్టుమ‌ని ప‌ది సినిమాలు కూడా చేయ‌కుండానే ఈ హీరో ఎనేలేని ఫ్యాన్ బేస్ తో అది కూడా సొంత బాషతో పాటు వేరే బాషలలో కూడా అభిమానులను ఏర్పరచుకుని రచ్చ చేస్తున్నారు.

ప్ర‌స్తుతం ఈయ‌న డియ‌ర్ కామ్రేడ్ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం జులై 26న విడుద‌ల కానుంది. దాంతో ప్ర‌తీ రాష్ట్రంలో తిరిగి మ్యూజిక‌ల్ ఈవెంట్స్ చేస్తున్నాడు. ఎందుకంటే డియ‌ర్ కామ్రేడ్ నాలుగు ద‌క్షిణాది భాష‌ల్లోనూ విడుద‌ల‌వుతుంది కాబ‌ట్టి. దాంతో ప్ర‌మోష‌న్స్ జోరు పెంచేస్తున్నాడు. ఈ క్ర‌మంలోనే బెంగ‌ళూర్, కొచ్చిల‌లో ఓ భారీ ఈవెంట్స్ పూర్తి చేసాడు విజ‌య్.

అభిమానులు పెద్ద ఎత్తున రావ‌డం వాళ్ల‌కు పాసులు అందించ‌డంలో ఈవెంట్ మేనేజ‌ర్లు స‌క్సెస్ కాక‌పోవ‌డంతో ర‌చ్చ అయిపోయింది. ఈ పాసుల కోసం కన్నడ అభిమానులు బెంగళూరు ఆడిటోరియం బ‌య‌ట నానా గోల చేస్తుంటే వాళ్ల‌ను కంట్రోల్ చేయ‌లేక పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వ‌చ్చింది. విష‌యం తెలుసుకుని బ‌య‌టికి వ‌చ్చిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ప‌ట్టుకుని ఆ అభిమానులు క‌న్నీరు పెట్టుకుంటున్నారు. నిజానికి యా క్రౌడ్ చూసి ఏమనాలో తెలీక నెత్తిన చేతులు పెట్టుకుని చూశాడు ఈ క్రేజీ హీరో. ప్రస్తుతం ఈ వీడియోలు జోరుగా వైరల్ అవుతున్నాయి.