‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ పై అంచనాలు పెంచిన మహా నాయకుడు


ఒక సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత ఆ సినిమాపై అంచనాలు పెరగాలి. ఇందులో ఏముందో చూడాలనిపించాలి. అయితే ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ ట్రైలర్ పరిస్థితి మాత్రం మరోలావుంది. ఎన్టీఆర్ బయోపిక్ కి రెండో పార్ట్ మహానాయకుడు. ఈ సినిమా ట్రైలర్ మొన్న రిలీజ్ అయ్యింది. ఈ ట్రైలర్ కొన్ని మెరుపులు వున్నాయి. అయితే ఈ మెరుపులు సినిమాపై అంచనాలు పెంచలేదు. పైగా మహానాయకుడులో ఇదేనా వుంది అనే అభిప్రాయం తెప్పించింది.

మొదటి బాగం కధానాయకుడు ఏకపక్షంగా నడిచింది. ఇందులో ఎలాంటి డ్రామా లేదు. రెండో బాగంగాలో కొంచెం డ్రామా వుండి తీరాలి. ఎందుకంటె ఎన్టీఆర్ చివరి రోజులు అలా సాగాయి. ఈ సంగతి అందరికీ తెలుసు. ఎవరు కాదన్న.. ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకున్నారు. లక్ష్మి పార్వతి జీవితంలోకి వచ్చి. ఎన్టీఆర్ కి ఆయన కుటుంబానికి అంతరం ఏర్పడింది. ఎన్టీఆర్ ఎలా చనిపోయారో అందరికీ తెలుసు. ఇది చూపిస్తే కొంచెం డ్రామా వుండేది. కానీ ట్రైలర్ లో ఆ ప్రస్థావనే లేదు. నాదెండ్ల భాస్కర్ రావుని విలన్ గా చేసి అలాగే కాంగ్రెస్ పార్టీని బూచిగా చూపించారు. దీంతో అసలు డ్రామా మిస్ అయ్యింది. ఇందులో ఏముందనే క్యురియాసిటీ తగ్గిపోయిందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

అయితే ఈ మహానాయకుడు ట్రైలర్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమాపై అంచనాలు పెంచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే మాంచి డ్రామా ట్రైలర్ వదిలాడు. కుటుంబ కుట్రల చిత్రం అంటున్నాడు. మహానాయకుడులో ఆ ప్రస్థావనే లేదు. దీంతో సహజంగానే’లక్ష్మీస్ ఎన్టీఆర్‌’ సినిమా ఆసక్తిని పెంచేసిందని చెప్పాలి.