పుట్టిన రోజు నాడు ఫ్యాన్స్ అంత ప్లాస్మా డొనేషన్ చేయండి అంటూ మహేష్ పిలుపు

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు (ఆగస్టు 09) అంటే అభిమానులకు పెద్ద పండగే..తమ ఇంట్లో సభ్యుడి పుట్టిన రోజు గా వారంతా భావిస్తారు. ఆ రోజంతా పలు సేవ కార్య క్రమాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. ఇక ఈఏడాది కూడా అలాగే చేయాలనీ అభిమానులంతా అనుకున్నారు. అయితే ప్రస్తుతం కరోనా ఉదృతి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అలాంటి వేడుకలకు దూరంగా ఉండాలని కోరిన మహేష్ …తాజాగా మరో కోరిక కోరారు.

తన పుట్టిన రోజున అభిమానులంతా ప్లాస్మా డొనేషన్ పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేయాలని, అవకాశం ఉన్నవారు ప్లాస్మా దానం చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. కరోనా నుంచి కోల్కొన్నవారు ప్లాస్మా డొనేట్ చేయడం ద్వారా మరికొంతమంది ప్రాణాలు కాపాడినవారవుతారు, ప్లాస్మా దానం చేయండి తోటివారి ప్రాణాలు నిలబెట్టండి అని మహేష్ ఫ్యాన్స్ కి పిలుపునిచ్చారు.