మహేష్ 25 మూవీ విడుదల తేదీ ఖరారు…

భరత్ అనే నేను తో సూపర్ హిట్ అందుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..ప్రస్తుతం తన 25 వ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. బృందావనం, ఎవడు, మున్నా వంటి సినిమాలతో ఆకట్టుకున్న వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవలే డెహ్రాడూన్ లో ముగించుకొని హైదరాబాద్ కు చిత్ర యూనిట్ రావడం జరిగింది.. త్వరలోనే గోవా లో మరో షెడ్యూల్ మొదలు పెట్టనున్నారు.

ఈ నేపథ్యం లో ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసారు. ఏప్రిల్ 05 న ఈ మూవీ ని ప్రేక్షకుల ముందుకు తీసుకరావాలని చిత్ర దర్శక, నిర్మాతలు ఫిక్స్ చేసారు. అలాగే మహేష్ బాబు పుట్టిన రోజు సందర్బంగా ఆగష్టు 9న ఫస్ట్ లుక్ ను విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఈ వార్తను అధికారికంగా ప్రకటించబోతారట. ఇప్పటికే మహేష్ అభిమానులు ఆయన పుట్టినరోజును భారీ ఎత్తున నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ వార్త కూడా నిజమైతే అభిమానులు మరింత సంబరాల్లో మునిగిపోవడం ఖాయమే.

పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపిలు కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దేవి శ్రీ సంగీతం అందిస్తున్నారు.