రష్మిక జతకమే మారిపోయిందిగా..

ఛలో..గీత గోవిందం చిత్రాలతో యూత్ & ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించిన రష్మిక..పరిచే ఛాన్స్ కొట్టిందా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు..విజయ్ దేవరకొండ , నాగ శౌర్య , నాని సరసన నటించిన ఈ క్రేజీ బ్యూటీ..ప్రస్తుతం నితిన్ తో ఓ సినిమా చేయబోతుంది. ఈ నేపథ్యంలో అమ్మడికి ప్రిన్స్ ఛాన్స్ వచ్చినట్లు సమాచారం.

అనిల్ రావిపూడి – మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తుంది.. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కబోతున్నది. జూన్ నుంచి సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

ప్రస్తుతం మహేష్ మహర్షి సినిమాతో మే 09 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో ఈ చిత్రం తెరకెక్కగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది.