మజిలీ 17 రోజుల కలెక్షన్స్ ఇలా ఉన్నాయి..

నాగ చైతన్య మంచి హిట్ కొట్టడం తో అక్కినేని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. అభిమానుల కంటే చైతు భార్య సమంత ఆనందానికి అవధులు లేవు.. గత కొంతకాలం గా చైతు కు హిట్ లేకపోవడం తో సామ్ మజిలీ విషయంలో చాల జాగ్రత్త పడింది. కథ – కథనం తో పాటు అన్ని విషయాల్లోనూ సామ్ చాల కేర్ తీసుకుంది. ఆమె తీసుకున్న జాగ్రత్తలు సినిమాను భారీ విజయం దిశ గా తీసుకెళ్లింది.

నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన ఈ మూవీ మొదటి రోజు మొదటి షో తోనే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాదు కలెక్షన్ల పరంగా కూడా చైతు కెరియర్ లో ది బెస్ట్ అనిపించింది. ఇక 17 రోజులకు గానూ ప్రపంచ వ్యాప్తంగా 60.05 కోట్ల గ్రాస్ ను అలాగే 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది. మరోపక్క జెర్సీ , కాంచన 3 చిత్రాల హావ నడుస్తున్న కానీ మజిలీ కలెక్షన్లు మాత్రం స్టడీగా ఉండడం అందర్నీ ఆశ్చర్య పరుస్తుంది.

ప్రపంచ వ్యాప్తంగా మజిలీ 17 రోజుల కలెక్షన్లు ఇలా ఉన్నాయి..

నైజాం – 12.05 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.07 కోట్లు
సీడెడ్ – 4.08 కోట్లు
గుంటూరు – 2.01 కోట్లు
తూర్పు గోదావరి – 1.65 కోట్లు
పశ్చిమ గోదావరి – 1.27 కోట్లు
కృష్ణా – 1.75 కోట్లు
నెల్లూరు – 0.84 కోట్లు

కర్ణాటక & రెస్ట్ అఫ్ ఇండియా- 4.02 కోట్లు

యూఎస్ఏ – 3.85 కోట్లు

మొత్తం 17రోజులకు గాను గ్రాస్ 60.05 కోట్లు కాగా, 35.57 కోట్ల షేర్ ను రాబట్టింది.