మజిలీ రిలీజ్ ఫై చిత్ర యూనిట్ క్లారిటీ..

నాగ చైతన్య – సమంత జంటగా నిన్ను కోరి ఫేమ్ శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం మజిలీ. ముందు నుండి ఈ సినిమాను ఏప్రిల్ 05 న విడుదల చేస్తామని ప్రకటించిన..తాజాగా ఎన్నికల తేదీ ప్రకటన రావడం తో ఈ సినిమాను వాయిదా వేస్తారనే వార్తలు గట్టిగా ప్రచారం కావడం తో మజిలీ యూనిట్ రిలీజ్ డేట్ ఫై క్లారిటీ ఇచ్చారు.

మజిలి వాయిదా పడే ఛాన్స్ లేదని ..విడుదలకు అన్ని సిద్ధమైయ్యాని.. సినిమా వాయిదా అంటూ వస్తున్న ప్రచారం ఫై అసలు నమ్మవద్దు అంటూ చిత్ర యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఈ క్లారిటీ తో అభిమానుల్లో ఉన్న అనుమానాలకు తెర పడినట్లు అయ్యింది. ఇక ఈ సినిమాలో చైతు క్రికెటర్ గా కనిపిస్తుండగా..ఆయన భార్య గా సామ్ కనిపిస్తుంది. నాగచైతన్య, దివ్యాంశ కౌశిక్‌ ప్రేమించుకుంటారు. కానీ కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోతారు. ఆ తర్వాత నాగచైతన్యకు సమంతతో పెళ్లి జరుగుతుంది. కానీ మొదట ప్రేమించిన అమ్మాయిని మరిచిపోలేక చైతూ సమంతను దూరం పెడతాడు అన్నట్లు టీజర్ లో చూపించారు.

షైన్‌ స్క్రీన్స్‌ బ్యానర్‌ ఫై నిర్మించబడిన ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు.