‘ మంచు లక్ష్మి ‘ కి సైతం తప్పని వేదింపులు..

మంచు లక్ష్మి ఈ పేరు తెలియని సినీ అభిమానులు ఉండరు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈమె , వెండితెర ఫైనే కాకుండా బుల్లితెర ఫై కూడా పలు షో లకు యాంకర్ గా కనిపించి ఆకట్టుకుంటూ వస్తుంది. అలాగే సోషల్ మీడియా లో సైతం ఈమె చాల యాక్టివ్ గా ఉంటుంది. సినిమాలకు సంబందించిన విశేషాలే కాకుండా పర్సనల్ విషయాలు సైతం షేర్ చేస్తుంటుంది.

తాజాగా దసరా రోజు అభిమానులతో లైవ్ చాట్ చేసి , వారి ప్రశ్నలకు సహనంగా సమాదానాలు తెలిపి ఆకట్టుకుంది. “మీరు ఎవరెవరితో పని చేశారో ఆ దర్శకులందరి నుంచి మీరేం నేర్చుకున్నారు? “ అంటూ జనసేనాని అభిమాని ఒకరు అడుగగా.. `సింపుల్ ప్రశ్నలు అడగరోయ్“ అంటూ లక్ష్మీ ఫన్నీగా రిప్లయ్ ఇచ్చారు. అలాగే కొంతమంది `మీటూ` ఉద్యమం గురించి అడిగారు. నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడినప్పుడు మీరు టాలీవుడ్లో అలాంటిదేం లేదని అన్నారు. చిన్మయ అంటున్నప్పుడు మాత్రం సపోర్టుగా వచ్చారని ఓ అభిమాని అన్నారు. “తప్పు జరిగితే నేనెపుడూ వ్యతిరేకిస్తాను. వాయిస్ ఆఫ్ ఉమెన్ (వావ్) తో మహిళలు ధైర్యంగా సమస్యల్ని చెప్పుకోవచ్చు. ఈ ప్రపంచాన్ని బెటర్గా తయారు చేద్దాం“ అని పిలుపునిచ్చారు లక్ష్మీ. ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నారా? అన్న ప్రశ్నకు.. తనకు కూడా లైఫ్లో వేధింపులు ఎదురయ్యాయని అయితే అది ఇండస్ట్రీలో కాదని తెలిపింది. మరి ఆమె ఎక్కడ లైంగిక వేధింపులు ఎదురుకుందో మాత్రం చెప్పలేదు.