నారప్ప కొడుకు ఫస్ట్ లుక్ రిలీజ్

వెంకీమామ తో సూపర్ హిట్ అందుకున్న వెంకటేష్..ప్రస్తుతం సీతమ్మ వాకింట్లో సిరిమల్లె చెట్టు ఫేమ్ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్లో తమిళ్ మూవీ అసురన్ రీమేక్ నారప్ప లో నటిస్తున్నాడు. ఈ సినిమాను వి క్రియేషన్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్లపై సురేష్ బాబు, కలైపులి యస్‌ థానులు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

రీసెంట్ గా త‌మిళ‌నాడు తిరుచందూర్ తెరికాడులోని రెడ్ డెసర్ట్ ప్రాంతంలో కొన్ని యాక్ష‌న్ సీన్స్ ను చిత్రీక‌రించారు. ఆ సన్నివేశాలు పూర్తి కావడం తో చిత్ర యూనిట్ ఆ షెడ్యూల్ కు ప్యాకప్ చెప్పి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక క‌రోనా వైర‌స్ ప్రభావం పూర్తిగా తగ్గాకే నారప్ప తదుపరి షెడ్యూల్ ను ప్లాన్ చేయనున్నారు. ఈ చిత్రంలో ప్రియ‌మ‌ణి కూడా కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆమె ప‌ల్లెటూరి యువ‌త పాత్ర పోషిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే చిత్రం నుండి వెంక‌టేష్, ప్రియ‌మ‌ణి లుక్స్ విడుద‌ల కాగా, తాజాగా నార‌ప్ప పెద్ద కొడుకు మునిక‌న్నా లుక్ విడుద‌ల చేశారు. మునిక‌న్నా పాత్ర‌లో కార్తీక్ ర‌త్నం న‌టిస్తుండ‌గా, ఆయ‌న బ‌ర్త్ డే సంద‌ర్భంగా పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. మణిశర్మ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. శ్యామ్‌ కె నాయుడు ఛాయాగ్రహణాన్ని సమకూర్చుతున్నారు.