నిహారిక పెళ్లికార్డు చూసారా..?

గుంటూరు ఐజి ప్రభాకరరావు కుమారుడు చైతన్య ను నిహారిక పెళ్లి చేసుకోబోతుంది. ఆగ‌స్ట్‌లో చైతన్యతో నిశ్చితార్ధం జ‌రుపుకోగా, డిసెంబర్‌ 9, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు పెళ్లి ముహూర్తం ఖరారు చేసారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లోని ఉదయ్‌ విలాస్‌లో చైతన్య, నిహారికల పెళ్లి జరగబోతుంది.

తాజాగా ఆమె పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు రిలీజైంది. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌కి మెగా ఫ్యామిలీ మొత్తం కదిలి వెళ్లనుంది. రిసెప్షన్ 11వ తేదీన హైదరాబాద్‌లోని జె.ఆర్.సి. కన్వెన్షన్ సెంటర్‌లో ఏర్పాటు చేశారు. ఇక మెగా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన హీరోయిన్ నిహారిక. ‘ఒక మనసు’ సినిమాతో హీరోయిన్ గా సినీరంగ ప్రవేశము చేసిన నిహారిక మొదటి సినిమాతోనే భారీ ప్లాప్ అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. చివరగా చేసిన ‘సూర్యకాంతం’ సినిమాకూడా నిహారికకు నిరాశపరిచింది. ఇక సినిమాలు వర్క్ అవుట్ కాదని తెలుసుకున్న ఈ మెగా డాటర్ పెళ్లికి సిద్ధమైంది.