అయ్యో .. మణిరత్నం సినిమా వదిలేశారు


కొన్ని ప‌రాజ‌యాలు ఎదురైనా మ‌ణిర‌త్నం సినిమా వస్తోంద‌న‌గానే ప్రేక్ష‌కుల్లో ప్ర‌త్యేక‌మైన అంచ‌నాలు ఏర్ప‌డుతుంటాయి. ప్ర‌తి ఫ్రేమ్‌తోనూ ఓ క‌థని చెప్ప‌గల స‌మ‌ర్థుడు మ‌ణిర‌త్నం. ప్ర‌తి సినిమానీ ఓ దృశ్యకావ్యంలా తీస్తుంటారు. ఒక్కో‌సారి ఒక్కో జోన‌ర్ క‌థ‌తో సినిమా తీసే మ‌ణిర‌త్నం ఈసారి ఓ మల్టీస్టార‌ర్ చిత్రంగా… కుటుంబ క‌థ‌కి మాఫియా నేప‌థ్యాన్ని జోడించి తెరకెక్కించారు. త‌మిళంలో ‘చక్కా చివాంద వాన‌మ్’గా రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘న‌వాబ్’గా విడుద‌లైంది

ఈ సినిమాకి మంచి టాక్ వచ్చింది. తమిళ్ లో సూపర్ హిట్ . తెలుగు లో కూడా మంచి రివ్యూస్ వచ్చాయి. ఐతే ఈ సినిమా మాత్రం జనాల్లోకి వెళ్ళలేదు తెలుగులో . కారణం ఈ సినిమాపై ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. తెలుగు రైట్స్ తీసుకున్న నిర్మాత సరైన విధంగా సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లలేదు. ఇది వరకు రెండు సినిమాలు దిల్ రాజు తీసుకున్నారు. అప్పుడు ప్రమోషన్స్ బాగానే చేశారు. ఐతే సినిమాలు ఫ్లాఫ్ అయ్యాయి. కానీ నవాబ్ హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ సినిమా మాత్రం జనాలకు రీచ్ చేయడంలో తడబడ్డారు.