నోటా బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఎంతో తెలుసా..?

కేవలం మూడు సినిమాలతోనే మూడు భాషల్లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఇతడి క్రేజ్ చూసిన దర్శక , నిర్మాతలు ఈయనతో సినిమాలు చేసేందుకు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగదాస్ శిష్యుడు ఆనంద్ శంకర్ విజయ్‌ను తన కథతో మెప్పించగలిచారు. విజయ్‌తో ద్విభాషా చిత్రం చేసి నోటా తో అక్టోబర్ 05 న ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఈ సినిమాపై తెలుగు, తమిళ రాష్ట్రాల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. విజయ్ స్వయంగా తమిళంలో డబ్బింగ్ చెప్పడంతో అక్కడ కూడా ఈ చిత్రంపై విపరీతమైన ఏర్పడింది. మరోపక్క తెలుగులో విజయ్ కున్న క్రేజ్ ఓ పక్క అయితే, ఈ చిత్రానికి వివాదం చుట్టుముట్టడంతో ఈ సినిమా గురించి ఇటు సినిమా ప్రేక్షకులే కాక, రాజకీయ నేతలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇన్ని అంచనాల మధ్య సినిమా రావడం తో చిత్ర ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయమని అంత మాట్లాడుకుంటున్నారు. వాస్తవానికి ఈ చిత్రానికి పెద్దగా ఓపెనింగ్స్ రానవసరం లేదు. ఎందుకంటే ఈ సినిమా కు పెట్టిన ఖర్చు తక్కువ కావడం. పరిమిత బడ్జెట్‌లో సినిమా తెరకెక్కడం, నటి నటుల రెమ్యూనరేషన్లు పెద్దగా లేకపోవడం వల్ల మాములు వసూళ్లు రాబట్టిన సినిమాకు లాభమే అంటున్నారు.

ఈ సినిమా మేకింగ్‌కు అయిన బడ్జెట్, విడుదల ఖర్చులు అన్నీ కలుపుకుంటే.. దాదాపు ఇరవై కోట్ల రూపాయలని తెలుస్తుంది. ఇందులో ఈ సినిమా డిజిటల్, హిందీ డబ్బింగ్ రైట్స్‌తో దాదాపు ఐదు కోట్ల రూపాయల మొత్తం రిటర్న్ అయ్యింది. సో సినిమా కేవలం పదిహేను కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబడితే హిట్ అయినట్టే. విజయ్ నటించిన గత చిత్రం గీత గోవిందం వంద కోట్ల రూపాయలను కలెక్ట్ చేయడం తో నోటా కేవలం ఓపెనింగ్స్ తోనే లాభాల బాట పెట్టినట్లే అని ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి.