తారక్ నట విశ్వరూపం చూసేందుకు సిద్ధం గా ఉండండి..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుండి మరోపది రోజుల్లో అసలు సిసలైన సినిమా రాబోతుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ మాస్ యాక్షన్ మూవీ ని చూడబోతున్నాం. ఇక ఆ సినిమా ఏంటో కొత్తగా చెప్పాల్సిన పనిలేదు..ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది. అవును అరవింద సమేత గురించే చెపుతున్నాం. గత నెల రోజులుగా ఈ సినిమా తాలూకా విషయాలు రోజు మీడియా లో హల్చల్ చేస్తూ , సినిమా ఫై అంచనాలు పెంచుతూ వస్తున్నాయి.

ఇటీవల విడుదలైన ఆడియో ఎంత సూపర్ హిట్ అయ్యిందో తెలియంది కాదు. ఇప్పటివరకు ఈ సినిమా కథ రాయలసీమ నేపథ్యంలో ఉండబోతుందని మాత్రమే తెలుసు. కానీ ఇందులోమరో యాంగిల్ కథను చూపించబోతున్నాడట త్రివిక్రమ్. సీమలో ఉన్న స్త్రీల దృష్టికోణం లో ఈ కథ సాగుతుందట. అంటే.. హింస వల్ల భర్తను.. సోదరులను.. పిల్లలను పోగొట్టుకున్న మహిళల ఎమోషన్స్ కు ఈ చిత్రం లో పెద్ద పీట వేయడం జరిగిందట. ఆ ఎమోషనల్ సీన్స్ లో తారక్ యాక్టింగ్ చూడడానికి రెండు కళ్లు చాలవని అంటున్నారు చిత్ర యూనిట్.

ఈ మూవీ లో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే.. ఈషా రెబ్బా హీరోయిన్లు గా నటిస్తుండగా , థమన్ సంగీతం అందిస్తున్నాడు. హారిక హాసినీ బ్యానర్ పై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దసరా కానుకగా అక్టోబర్ 11 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.