వందకోట్ల దెబ్బ.. అబ్బా.. కత్తితో తొడగొట్టిన

అరవింద సమేత చూసిన వాళ్ళంత ఒకటే మాట తొలి అరగంట అదిరిపోయిందని. నిజమే ఎన్టీఆర్ చేతికి కత్తి మొలిచింది. మొండికత్తితో తొడగొట్టాడు ఎన్టీఆర్. ఇప్పుడే అదే పోస్టర్ వంద కోట్ల మార్కుతో వదిలారు. తొలివారాంతంలోనే ‘అరవింద సమేత..’ రూ.100కోట్లు(గ్రాస్‌) వసూలు చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు ఇంతటి ఘన విజయాన్ని అందించిన అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది.
ఈ రోజే ఈ సినిమా సక్సెస్ మీట్ కూడా పెట్టారు.

వేదికపై ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘12 ఏళ్ల నుంచి నేను ఎదురుచూస్తున్న తరుణం.. మిత్రుడు, ఆత్మబంధువు, మా అమ్మకు ఇంకో కొడుకు, నా పిల్లలకు మామయ్య, నా భార్యకు అన్న, నాకు బావ.. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌తో ఓ చిత్రం తీయాలి, చేస్తే జీవితాంతం నా గుండె లోతుల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి. రేపు నా పిల్లలకు, సమాజానికి సినిమా చూపించి నేను గర్వంగా నిల్చోవాలి అనుకున్న తరుణం.. మూడు రోజుల క్రితం ‘అరవింద సమేత’తో రానే వచ్చింది” అని తన ఆనందం పంచుకున్నారు ఎన్టీఆర్.