ఎన్టీఆర్ కథానాయకుడు ప్రీమియర్ టాక్ – అయోమయంలో ‘ఫ్యాన్స్’

సంక్రాంతి అంటేనే సినీ సందడి..పెద్ద హీరోల చిత్రాలన్నీ సంక్రాంతి బరిలోదించేందుకు ప్లాన్ చేస్తారు. ఈ సంక్రాంతికి కూడా అలాగే ప్లాన్ చేసారు. ఈసారి ఏకంగా నాల్గు పెద్ద సినిమాలు బరిలో రాబోతుండడం తో సినీ ప్రేక్షకులు పండగా భావిస్తున్నారు. ఈ నాల్గు సినిమాల్లో నందమూరి బాలకృష్ణ ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఎన్టీఆర్ – కథానాయకుడు’ మూవీ భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

గతంలో సంక్రాంతి బరిలో వచ్చిన బాలయ్య సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్సే. 2016 సంక్రాంతికి ‘డిక్టేటర్‌’గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ తరువాత 2017లో ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ అంటూ వందో చిత్రం బాక్సాఫీస్‌ని షేక్ చేశారు. ఖైదీ, శతమానం భవతి చిత్రాలు హిట్ టాక్ తెచ్చున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద సత్తాచాటాడు బాలయ్య. గత ఏడాది 2018లో ‘జై సింహా’ అంటూ సంక్రాంతి బరిలో తొడకొట్టాడు బాలయ్య. ‘అజ్ఞాతవాసి’.. రాజ్ తరుణ్ ‘రంగుల రాట్నం’.. సూర్య ‘గ్యాంగ్’ చిత్రాలు వచ్చినప్పటికీ అవేమి బాలయ్య ముందు నిలువలేకపోయాయి.

ఇక ఈసారి కూడా బాలయ్య విజయ డంఖా మోగించబోతాడని అంత అనుకున్నారు. కానీ ప్రీమియర్ టాక్ చూస్తే మిశ్రమ స్పందన వస్తుంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు జీవిత కథ వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది , ఫస్ట్ బాగా సాగదీశాడని , విసుగు తెప్పించారని కొందరు అంటున్నారు. మనసుకు హత్తుకునే సన్నివేశం ఒకటీ లేదని చెపుతున్నారు. కానీ, సెకండాఫ్ మాత్రం బాగుందట.

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడం, తెలుగు దేశం పార్టీని ప్రకటించడం వంటి ఎపిసోడ్స్ బాగా అనిపించాయని అంటున్నారు. సెకండాఫ్‌లో వచ్చే ల్యాబ్ ప్రింట్ సీన్, దివిసీమ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ గా ఉన్నాయని చెపుతున్నారు. కీరవాణి సంగీతం ఎంతో ఆకట్టుకుందని చెపుతున్నారు. మరి ఫైనల్ రిపోర్ట్ ఎలా ఉంటుందనేది చూడాలి.