అబ్బాబ్బా..ఎన్టీఆర్ ఏమన్నా కార్ కొన్నాడా..?

ప్రస్తుతం ఇండస్ట్రీ లో , సోషల్ మీడియా లో ఎక్కడ చూసిన ఒకే టాపిక్ అది ఎన్టీఆర్ కొత్త కార్ గురించి. ఎన్టీఆర్ కు కార్ల పిచ్చి ఎక్కువ. మార్కెట్ లోకి ఎప్పుడెప్పుడు కొత్త కార్ వస్తుందా అని ఓ కన్నేసి ఉంచుతాడు. ఆ కార్ నచ్చిందా వెంటనే దానిపై ఖర్చిఫ్ వేస్తాడు. తాజాగా ఇప్పుడు అలాగే చేసాడట. లంబోర్ఘిని ఉరుస్ అనే కొత్త కార్ ను బుక్ చేసాడట. మనదగ్గర ఈ కార్ లేకపోవడం తో ఇటలీ నుండి తెప్పిస్తున్నాడట.  దీని ఖరీదు రూ.3 కోట్ల నుంచి మొదలవుతుంది. అయితే జూనియర్ బుక్ చేసుకున్న మోడల్ మాత్రం రూ. 5 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తుంది. ఐదుగురు కూర్చోడానికి వీలుండే ఈ కారు అత్యంత విలాసవంతంగా ఉంటుంది. ఆల్ సర్ఫేస్ పర్పస్ తో ఈ కారు మార్కెట్ లోకి వచ్చింది. అంటే ఎక్కడైనా.. ఎలాగైనా దీన్ని నడపొచ్చు. మన రెగ్యులర్ రోడ్ల మీద మాత్రమే కాకుండా ఎడారి.. కొండ ప్రాంతంలో కూడా ఈ కారులో అదిరిపోయే రైడ్ చేయొచ్చన్నమాట.  మరి ఈ కార్ లో ఎన్టీఆర్ ఎప్పుడు షికారు చేస్తాడో చూడాలి.