ఎన్టీఆర్ తప్పులే తేజు చేసాడు..

పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ చిత్రాలతో వరుస హిట్లు అందుకొని ఒక్కసారిగా సుప్రీమ్ స్టార్ అయినా సాయి ధరమ్ తేజ్ ఆ తర్వాత వరుస ప్లాప్స్ చవిచూశాడు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు వరుస ప్లాప్ చిత్రాలు రావడం నిజంగా దారుణం. దీనికి ప్రధాన కారణం తేజ్ తీసుకోకపోయినా జాగ్రత్తలే అంటున్నారు. సరైన కథల్ని ఎంచులేకోకపోవడం, లుక్స్ పరంగా ఆలోచించకపోవడం, బరువు పెరిగిపోవడం వంటి కారణాల వలన తేజ్ సినిమాలేవీ కూడా ఆడలేకపోయాయి. గతం లో తేజ్ మాదిరిగానే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇలాంటి తప్పులే చేసి తర్వాత తన తప్పులు తెలుసుకొని మళ్లీ హిట్ కొట్టి తన సత్తా చాటుకున్నాడు.

‘యమదొంగ’ ముందు వరకు కూడా ఎన్టీఆర్ ఎంతో లావుగా ఉన్నారు..ఆకట్టుకోలేని కథలు ఎంచుకొని తప్పు చేసాడు. ఆ తప్పు తెలుసుకొని మళ్లీ ఆ తప్పు చేయలేదు. ఇప్పుడు తేజు కూడా అదే బాటలో ఉన్నాడు. ప్రస్తుతం తేజు కొత్త సినిమాలేవీ చేయకుండా తన మేకోవర్ ను మార్చుకునేందుకు అమెరికా వెళ్ళాడు. కొన్ని రోజుల పాటు అక్కడే ఉంది తన లుక్ ను మార్చుకునే పనిలో పడ్డాడు. మరి వచ్చాక ఎలాంటి కథను ఎంచుకుంటాడో..హిట్ కొడతాడా లేదో చూడాలి.