ప్రియా ప్రకాష్ వారియర్‌ కు షాక్ ఇచ్చిన నెటిజన్లు..

ప్రేమికుల రోజు సందర్భంగా.. కన్నుగీటిన వీడియోతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ ప్రియా ప్రకాష్ వారియర్‌..ఈమెకు ఎంతగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందో చెప్పాల్సిన పనిలేదు..ప్రతి ఒక్కరి స్మార్ట్ ఫోన్ లో కన్నుగీటిన వీడియో ఉందంటే అర్ధం చేసుకోవాలి అమ్మడు ఏ రేంజ్ లో ఆకట్టుకుందో.. ఈ వీడియో తర్వాత పలు అగ్ర సంస్థలు సైతం తన్మ బ్రాండ్ లకు ఈమెను బ్రాండ్ అంబాసిడర్ గా తీసుకోవడం జరిగింది.

ప్రస్తుతం ఈ భామ ఒరు ఆదార్‌ లవ్‌ సినిమాలో నటిస్తుంది..తాజాగా దీనికి సంబందించిన ఓ వీడియో సాంగ్ విడుదల చేసారు. ఈ సాంగ్ సరికొత్త రికార్డు ను సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో అతి తక్కువ కాలంలో ఎక్కువ డిస్‌లైక్‌లు సాధించిన సాంగ్‌గా రికార్డును క్రియేట్‌ చేసింది. ఇప్పటికే ఈ పాటను పది లక్షలకు పైగా వీక్షించగా, రెండు లక్షలకు పైగా డిస్‌లైక్‌లతో ట్రెండింగ్‌లో ఉంది. ఇప్పుడు ఈ పాటే సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. సడెన్ గా ప్రియా కు ఎంత భారీ వ్యతిరేకత రావడం కారణం ఏంటి అనేది తెలియదు కానీ ప్రస్తుతం డిస్‌లైక్‌లు మాత్రం హాట్ టాపిక్ అయ్యింది. మీరు కూడా ఈ వీడియో సాంగ్ ఫై లుక్ వెయ్యండి.