టాక్ : పందెం కోడి 2

మాస్ హీరో విశాల్ హీరోగా ఎన్‌.లింగుస్వామి దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పందెంకోడి 2’. వీరిద్దరి కలయికలో 13 సంవత్సరాల క్రితం వచ్చిన ‘పందెంకోడి’ విశాల్‌ కెరీర్‌లోనే బిగెస్ట్‌ హిట్‌గా నిలిచింది. మళ్ళీ విశాల్‌, లింగుస్వామి కాంబినేషన్‌లో వస్తోన్న ‘పందెంకోడి 2’ చిత్రంపై భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయి. ‘పందెం కోడి 2’ మాస్‌ హీరో విశాల్‌కి 25వ సినిమా కావడం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం టీజర్‌కి, ట్రైలర్‌కి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ రావడం తో ఈ సినిమా ఫై భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

లైట్‌హౌస్‌ మూవీ మేకర్స్‌ ఎల్‌ఎల్‌పి పతాకంపై ఠాగూర్‌ మధు సమర్పణలో విశాల్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ, లైకా ప్రొడక్షన్స్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై విశాల్‌, దవళ్‌ జయంతిలాల్‌ గడా, అక్షయ్‌ జయంతి లాల్‌ గడా ఈ చిత్రాన్ని నిర్మించారు. దసరా కానుకగా ఈరోజు వరల్డ్ వైడ్ గా విడుదలైన ఈ మూవీ టాక్ ఎలా ఉంది..? విశాల్ ఖాతాలో మరో హిట్ పడిందా..లేదా..? లింగుస్వామి ఎలాంటి యాక్షన్ ను తీసుకొచ్చాడు..? కీర్తి సురేష్ యాక్టింగ్ ఎలా ఉందనేది..? పబ్లిక్ టాక్ లో చూద్దాం.

తెలుగు , తమిళ్ భాషల్లో కొద్దీ సేపటి క్రితం విడుదలైనప్పటి ఓవర్సీస్ లో మాత్రం రాత్రే ప్రీమియర్ షోస్ పడడం జరిగింది. దీంతో ఈ చిత్ర టాక్ ముందే బయటకొచ్చింది. సినిమా చూసిన వారంతా తమ స్పందనను సోషల్ మీడియా ద్వారా వ్యక్త పరుస్తున్నారు.

పందెం కోడి మాదిరిగా సీక్వెల్ లేదని చెపుతున్నారు. పందెంకోడి, పొగరు సినిమాలు కలిపితే.. పందెంకోడి 2 అని , ఇది కేవలం బీసీ సెంటర్స్ కు మాత్రమే నచ్చుతుందని అంటున్నారు. యాక్షన్ మితిమీరిందని , కథ కన్నా యాక్షన్ పార్ట్ పైనే డైరెక్టర్ ఎక్కువ శ్రద్ద పెట్టాడని , డైలాగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకొనేలా లేవని , కీర్తి – విశాల్ మధ్య ప్రేమ సన్నివేశాలు అంతగా ఆకట్టుకోలేకపోయాయని చెపుతున్నారు. ఓవరాల్ గా పందెం కోడి ని దృష్టిలో పెట్టుకొని వెళ్తే నిరాశ చెందుతారని అంటున్నారు. మరి మన ఆడియన్స్ కు ఎంతవరకు నచ్చుతుందో చూడాలి.