హైపర్ ఆది చిత్రానికి పవన్ సాయం…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలకు దూరమై , తాను స్థాపించిన జనసేన పార్టీ లో నిమగ్నం అయ్యాడు. అయినప్పటికీ అప్పుడప్పుడు సినిమా వేడుకలో పాల్గొంటూ అభిమానులను అలరిస్తున్నాడు. తాజాగా హైపర్ ఆది చిత్రానికి పవన్ సాయం చేయబోతున్నాడు.

‘ఆ నలుగురు’ సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న చంద్ర సిద్ధార్థ తాజాగా ‘ఆటగదరా శివ’ చిత్రాన్ని తెరకెక్కించారు. దోడన్న, ఉదయ్, హైపర్ ఆది, చమ్మక్ చంద్ర, చలాకీ చంటి తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నుంచి ఆ మధ్య మొదటి పాట విడుదల కాగా.. తాజాగా రెండో సాంగ్‌ విడుదల కాబోతుంది. ఎట్టాగయ్య శివ అంటూ సాగే ఈ పాటను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం విడుదల చేయబోతున్నారు. ఇక ఈ చిత్రాన్ని రాక్‌లైన్ వెంకటేశ్ నిర్మించగా.. వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.