పవన్ కళ్యాణ్ కు సంబందించిన మరో లవ్ స్టోరీ బయటపడింది..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరో ప్రేమ కథ బయటపడింది..పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడనేది మాత్రం అందరికి తెలుసు కానీ అయన జీవితంలో మరో ప్రేమాయణం కూడా ఉందనేది బయటపడింది. కాకపోతే ఇది ఇప్పటిది కాదు సినిమాల్లోకి రాకముందు. మెగా ఫ్యామిలీ మొదట మద్రాస్ లో ఉండేవారు..చిరంజీవి సినిమాలతో బిజీ గా ఉంటె పవన్ చదువుతూ కంప్యూటర్‌ క్లాసులకు వెళ్తుండేవాడు.

అదే కంప్యూటర్‌ క్లాసులకు ఓ అందమైన అమ్మాయి వచ్చేదట. పవన్‌తో చాలా క్లోజ్‌గా మాట్లాడేదట. కోర్సు ముగుస్తున్న కొద్దీ… వాళ్లిద్దరి మధ్య చనువు పెరగడం మొదలైంది. ఇదీ గమనించిన పవన్ ఫ్రెండ్స్ ‘ఇది ఫ్రెండ్‌షిప్‌ మాత్రమే కాదు.. ప్రేమ కూడా.. నీ మనసులో మాట చెప్పేయ్‌’ అంటూ పవన్‌ని ఎంకరేంజ్ చేశారట. నిజంగా ‘ఇది ప్రేమేనేమో’ అనుకుని.. ఆమెకు ‘ఐ లవ్‌ యూ’ చెప్పేందుకు సిద్దమయ్యాడట. వారి ఇంట్లో ఎవరూ వాడకుండా ఉన్న ఓ పాత కారుని బయటకు తీసి, శుభ్రం చేసి రేడిగా ఉంచాడట.

అప్పటికే ఆ అమ్మాయికి ఉద్యోగం కూడా వచ్చేసింది. దీంతో పవన్… అ అమ్మాయి ఆఫీసు వరకూ ఆ పాత కారులోనే వెళ్లి.. ‘నిన్ను ఇంటి దగ్గర డ్రాప్‌ చేస్తా’ అని ఆ అమ్మాయితో చెప్పి.. తన కారులో ఎక్కించుకున్నాడట. ఆ తర్వాత.. పవన్.. తన మనసులోని మాటను ఇబ్బంది పడుతూనే ఆ అమ్మాయికి చెప్పాడట. పవన్ చెప్పిందంతా విన్న అమ్మాయి.. ‘అసలు ప్రేమంటే ఏమిటనుకున్నావ్‌? ఈ వయసులో ప్రేమేంటి’ అంటూ క్లాసు పీకిందట. ఆమె క్లాస్ కు ఏమి చేయాలో తెలియక అలానే ఉండి పోయాడట.. ఈ విషయాలన్ని చెప్పుకుంటూ పవన్.. ‘ఆ సమయంలో ఆ అమ్మాయి మా క్లాస్‌ టీచర్‌లా కనిపించింది. అన్ని క్లాసులు పీకింది..’ అంటూ తన చిన్ననాటి.. ప్రేమ విషయాలను గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద పవన్ ప్రేమ వ్యవహారం భలేగా ఉందే అంటూ అభిమానులు మాట్లాడుకుంటున్నారు.