పవర్ స్టార్ సరసన నిజంగా ఆమెనేనా..?

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తో పాటు హరీష్ శంకర్ డైరెక్షన్లో ఒకటి , క్రిష్ డైరెక్షన్లో , సురేందర్ రెడ్డి డైరెక్షన్లో మరో చిత్రాన్ని చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూడే కాక మరో చిత్రానికి ఓకే చెప్పాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్‌కల్యాణ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని ‘కింగ్ ఆఫ్‌ యాటిట్యూడ్‌. .. తెలుగు సినిమా ఫేవరేట్‌ పోలీస్‌ ఆఫీసర్‌ మరోసారి హై ఓల్టేజ్‌ రోల్‌తో మరోసారి రాబోతున్నారు’ అంటూ సినిమాను అనౌన్స్‌ చేశారు.

ఇది మలయాళ చిత్రం అయ్యప్పనుమ్ కోషియమ్‌కు రీమేక్‌ అని, వకీల్‌ సాబ్‌ తర్వాత పవన్‌ ఈ చిత్రంలోనే నటించనున్నాడని అంటున్నారు. ఈ సినిమాకు ‘బిల్లా రంగా’ అనే టైటిల్‌ పరిశీలనలో ఉన్నట్లు టాక్‌. కాగా లేటెస్ట్‌ సమాచారం మేరకు ఈ సినిమాలో పవన్‌ కల్యాణ్‌ జోడీగా సాయిపల్లవి నటిస్తుందని సోషల్‌ మీడియాలో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. మెగా ఫ్యామిలీలో ఇప్పటికే వరణ్‌తేజ్‌తో జోడీ కట్టి తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన సాయిపల్లవి..ఇప్పుడు బాబాయ్‌ పవన్‌కల్యాణ్‌తో నిజంగా జతకడుతుందా లేదా అనేది చూడాలి.