పాయల్.. ఇంట్రస్టింగ్ రోల్


ఒక్క సినిమా.. ఒకే ఒక్క సినిమా చాలు. అదృష్టం పంట పండ‌డానికి. అలాంటి సినిమా ఆర్‌.ఎక్స్ 100 తో ద‌క్కింది పాయ‌ల్ రాజ్ పుట్‌కి. ఈ సినిమాకి ముందు ఆమె ఎవ‌రో తెలీదు. ఈ సినిమా చూశాక మాత్రం ఆమె గురించి మాట్లాడుకోకుండా ఉండ‌లేరు. బోల్డు సన్నివేశాల‌లో భ‌లే న‌టించేసింద‌ని పేరు తెచ్చుకుంది పాయ‌ల్‌. ఇప్పుడు పాయల్ పేరు హాట్ టాపిక్.

కాగా ఇప్పుడు ఒక సాహసం చేయబోతుంది పాయల్. రవితేజ హీరోగా విఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో ఒక హీరోయిన్ గా పాయల్ దాదాపుగా ఖరారు అయ్యింది. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర అప్ డేట్ ఒక సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. పాయల్ కళ్లు లేని అమ్మాయిగా చెవులు వినిపించని అమ్మాయిగా నటించబోతుందట. ఆమె పాత్ర హైలెట్ గా ఉటుందని టాక్.