పాయల్ అందరిలా కాదట..

RX100 చిత్రంతో ఇండస్ట్రీ కి పరిచయమైనా పాయల్ రాజ్ పుత్..మొదటి చిత్రంతోనే యూత్ కు బాగా దగ్గరయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ గా ఉన్న ఈ బ్యూటీ..తాజాగా RDX లవ్ అంటూ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ చిత్ర ట్రైలర్ విడుదలై పాయల్ లోని మరోకోణాన్ని చూపించింది. కాగా పాయల్ ఎంచుకుంటున్న సినిమాల ఫై సినీ విశ్లేషకులు మరోలా మాట్లాడుకుంటున్నారు.

హీరోయిన్లకు కెరీర్ విషయంలో బోలెడన్ని క్యాలుక్యులేషన్స్ ఉంటాయి. కెరీర్ స్టార్టింగ్‌లో ఎలా ఉండాలి. క్లైమాక్స్ చేరినప్పుడు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అని చాలా థియరీస్ ఉంటాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు చాలామంది హీరోయిన్లు ఆ థియరీతోనే కెరీర్‌ను రన్ చేస్తూ ఉంటారు. కానీ పాయల్ రాజ్‌పుత్ మాత్రం క్యాలిక్యులేషన్స్‌తో సంబంధం లేని సినిమాలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తుందని అంటున్నారు.