‘ పేట ‘ టాక్..

2.ఓ సూపర్ సక్సెస్ అందుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్..తాజాగా పేటతో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కార్తీక్ సుబ్బరాజన్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ మూవీలో త్రిష, సిమ్రాన్ లు హీరోయిన్లుగా నటించగా, విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్ధిఖీ ప్రధాన పాత్రలు పోషించగా, అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించారు. తమిళంలో సన్ పిక్చర్ విడుదల చేయగా, తెలుగులో వల్లభనేని అశోక్ విడుదల చేసారు.

ఇక ఈ చిత్ర ప్రీమియర్స్ షోస్ అర్ధరాత్రి నుండే మొదలు అయ్యాయి. సినిమా చూసిన వారంతా 90ల నాటి రజినీకాంత్‌ను గుర్తుచేసిన పక్కా మాస్ మసాలా సినిమా అంటూ చెప్పుతున్నారు. రజనీకాంత్ స్టైల్లో పక్కా మాస్ సినిమా అని, ఇది ‘బాషా’ను మించిపోయి ఉందని అంటున్నారు.

హాస్టల్ వార్డెన్‌గా రజనీకాంత్ నటన, కామెడీ టైమింగ్, ఫైట్లు, మాస్ పాటలు ఇలా అన్ని కూడా సినిమాలో హైలైట్ గా ఉన్నాయని, ఫస్టాఫ్‌లో వచ్చే ట్విస్ట్, ఇంటర్వల్ బ్యాంగ్ సినిమాకే హైలైట్ అంటున్నారు. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని ఓవరాల్ గా చాలా కాలం తరవాత పాత తలైవాను చూశామని చెపుతున్నారు.