పూర్ణ ‘బ్యాక్ డోర్’ లో ఫుల్ రొమాన్స్

అవును , సీమటపాకాయి చిత్రాలతో అలరించిన పూర్ణ..తాజాగా ఛాలెంజ్ రోల్ చేస్తుంది. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ ‘బ్యాక్ డోర్’ పేరుతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో పూర్ణ నటిస్తుండగా.. ‘ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్’ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ను హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో చిత్రబృందం విడుదల చేసింది. ఈ టీజర్‌‌లో హీరోయిన్ పూర్ణ, తేజ మధ్య సన్నివేశాలు రొమాంటిక్ గా ఆకట్టుకొనే విధంగా ఉన్నాయి. పూర్ణ, తేజ మధ్య కెమిస్ట్రీ బాగా పండినట్టు తెరపైన కనిపించింది.