షాక్ : చిన్నప్పటి నుండి ఓ వ్యాధితో బాధపడుతున్న ప్రియాంక

ప్రియాంక చోప్రాకి సంబధించిన ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. ఆమె ఐదేళ్ల వయసు నుంచే ఆస్తమాతో బాధపడుతుంది. ఈ ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది ప్రియాంక. ప్రియాంక సిప్లా కంపెనీకి చెందిన ఇన్హేలర్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తుంది. ఇన్హేలర్ల ద్వారా జీవిన విధానంలో ఎలాంటి సమస్యలు తలెత్తవని, ఆస్తమాను పూర్తిగా దూరం చేయకపోయినా శ్వాస తీసుకోవడంలో దోహదపడుతుందని చెప్పింది. ఇదే సందర్భంలో తమ ఆస్తమా గురించి చెప్పింది.

‘నా గురించి బాగా తెలిసినవారందరికీ నాకు ఆస్తమా ఉందని తెలుసు. ఐదేళ్ల వయసు నుంచే ఈ వ్యాధితో బాధపడుతున్నా. అమ్మ వైద్యురాలు కాబట్టి ట్యాబ్లెట్లు వేసుకోవడం కంటే ఇన్హేలర్‌ వాడటం మంచిదని సూచించింది. ఇన్హేలర్‌ జీవితాంతం ఓ అలవాటుగా మారుతుందేమోనని అందరూ సందేహపడ్డారు. కానీ అలాంటిదేమీ ఉండదు. నా వద్ద ఇన్హేలర్‌ ఉన్నంత వరకు జీవితంలో నన్ను ఎదగనివ్వకుండా ఆస్తమా నన్ను ఆపలేదు’ అని చెప్పింది ప్రియాంక.