ప్రియాంక తల్లి కాబోతుందా..ఇలా చూస్తే అలాగే అనిపిస్తుంది

బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా రీసెంట్ గా తనకన్నా చిన్నవాడైన నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని ఓ ఇంటిది అయినా సంగతి తెలిసిందే. వీరి పెళ్లి తర్వాత ప్రియాంక నిత్యం వారిద్దరూ కలిసిన ఫొటోస్ ను పోస్ట్ చేస్తూ అభిమానులను సంతోష పెడుతూ వస్తుంది. అతి త్వరలో మరో తీపి కబురు చెప్పబోతుందా…? అది తల్లికాబోతున్నాననే విషయమేనా..అంటే అవుననే అంటున్నాయి తాజా పిక్స్.

ప్రియాంక నటించిన హాలీవుడ్ మూవీ ఈజ్ ఇన్టిట్ రొమాంటిక్ ప్రమోషన్లలో సందడి చేస్తుంది. ఇందులో భాగంగా ఆమె కడుపు కాస్త ఉబ్బి ఉండటాన్ని మీడియా వారు ఆమె తల్లి కాబోతుందనే వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంత ప్రచారం చేస్తున్న కానీ ఈ వార్త ఫై నిక్ కానీ ప్రియాంక కానీ స్పందించకపోయేసరికి ఈ వార్తల్లో నిజం ఉందని అంత ఫిక్స్ అవుతున్నారు. కొన్ని రోజుల క్రితం మీడియా తో మాట్లాడుతూ ఇప్పుడే తల్లితండ్రులయ్యే ఉద్దేశం లేదని టైం తీసుకుని ప్లాన్ చేసుకుంటామని తెలిపింది. నిక్ మాత్రం వీలైనంత త్వరగా తండ్రి కావాలని ఉందని వేరే ఇంటర్వ్యూలో చెప్పాడు. మరి ఇద్దరి మాటల్లో ఎవరిదీ నిజమో తెలియదు కానీ ప్రస్తుతం మాత్రం ప్రియాంక తల్లి కాబోతుందనే వార్తలు మాత్రం జోరుగా ప్రచారం అవుతున్నాయి.