ఫ్యాన్సీ రేటుకు పుష్ప శాటిలైట్ రైట్స్ ..

అల్లు అర్జున్ – సుకుమార్ కలయికలో పుష్ప మూవీ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ముందు మొదటి షెడ్యూల్ జరుగగా..ఆ తర్వాత లాక్ డౌన్ వచ్చి షూటింగ్ కు బ్రేక్ పడింది. ప్రస్తుతం షూటింగ్ లకు అనుమతులు రావడం తో షూటింగ్ ను మొదలుపెట్టాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది.

నవంబర్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోందట. కేరళ, లేదా మారేడుమిల్లి అడవుల్లో ఈ సినిమా షూటింగ్ మొదలుకాబోతోందట. ముందుగా యాక్షన్ సీన్లను తెరకెక్కించబోతున్నారట. అయితే ఫారెస్ట్ లొకేషన్లకు వెళ్లే ముందు వైజాగ్లో కొద్దిగా షూటింగ్ చేయాల్సి ఉందట. అక్కడ మూడు రోజుల పాటు షూట్ జరిగే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. అందులో అల్లు అర్జున్ సహా పలువురు ముఖ్య తారాగణం పాల్గొననున్నారు. ఇదిలా ఉంటె ఈ చిత్ర శాటిలైట్ రైట్స్ ను ప్రముఖ ఛానల్ స్టార్ మా భారీ ధరకు కొనుగోలు చేసినట్లు సమాచారం.