రాజశేఖర్ ఓపెన్ ఆఫర్

యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ కొత్త దర్శకులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కొంతకాలం క్రితం వరకు సరైన హిట్ లేక బాధపడుతున్న ఈయన కు గరుడవేగా తో సూపర్ హిట్ ఇచ్చి తనలోని నూతన ఉత్సహాన్ని నింపాడు ప్రవీణ్ సత్తారు. ఈ హిట్ తో మళ్లీ ఫామ్లోకి వచ్చిన రాజశేఖర్..ప్రస్తుతం ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో కల్కి అనే సినిమా చేసాడు. ఈ మూవీ ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ తరుణంలో చిత్ర ప్రమోషన్లలో పాల్గొన్న రాజశేఖర్ ప్రశాంత్ వర్మ, ప్రవీణ్ సత్తారు లాంటి దర్శకుల వలన యంగ్ జనరేషన్ వద్ద ఎలా పనిచేయాలో నేర్చుకున్నాను ..మంచి సబ్జెక్ట్ ఉంటే నా దగ్గరకు రండి, సినిమా చేద్దాం. మనకు నిర్మాత కళ్యాణ్ ఉన్నారు అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. మరి రాజశేఖర్ ఆఫర్ ను ఎవరు వినియోగించుకుంటారో చూడాలి.

ఇక కల్కి కథ విషయానికి వస్తే..ఈ చిత్రం 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో తెర‌కెక్కుతుంది. చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ చిత్రంలో ముగ్గురు క‌థానాయికలు నటిస్తుండగా, అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత.