రామ్ చరణ్.. స్వీట్‌ హార్ట్స్‌

హీరోయిన్ స్నేహ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో షేర్ చేశారు. అందులో స్నేహ కుమారుడు విహాన్‌ జుట్టును రామ్ చరణ్‌ స్టైల్‌గా సవరిస్తూ కనిపించారు. ‘‘వినయ విధేయ రామ’ సెట్‌లో తీసిన ఫొటో ఇది. చరణ్‌కు విహాన్ పెద్ద అభిమాని.. బాబుతో కలిసి ఆడుకునే చిన్న హృదయం చరణ్‌‌లో ఉంది‌. నేను సెట్‌కు విహాన్‌ను తీసుకెళ్లిన ప్రతిసారీ వాడితో కలిసి చరణ్‌ ఆడుకునే వాడు. స్వీట్‌ హార్ట్స్‌..’ అని ఈ ఫొటోకు స్నేహ క్యాప్షన్‌ ఇచ్చింది స్నేహ. ప్రస్తుతం సోషల్‌మీడియాలో ఈ ఫొటో అభిమానుల్ని ఆకట్టుకుంటోంది.

కాగా ఇటివలే ఇంటర్వ్యూలో స్నేహ, చరణ్ గురించి మాట్లాడుతూ.. చరణ్ తో వినయ విదేయ రామ చేశా. మెగాస్టార్ కొడుకు క‌దా! ఎలా ఉంటాడోన‌నిపించింది. కానీ, చాలా సింపుల్‌గా ఉంటాడు. అందరితోనూ చాలా మ‌ర్యాద‌గా వ్యవహరిస్తాడు. చిరంజీవిగారిని కూడా ఓ ఈవెంట్‌లో క‌లిశా. ఆయ‌న కూడా అంతే చాలా సింపుల్‌గా ఉంటారు. బ‌హుశా చ‌ర‌ణ్‌కు అదే వ‌చ్చిందేమో” అని చెప్పుకొచ్చింది స్నేహ.