బిగ్ బాస్ నిర్వాహకులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కోర్టు !

కింగ్ నాగార్జున హోస్ట్ చేయబోయే బిగ్ బాస్ సీజన్ 3 ప్రారంభానికి ముందే రచ్చ రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఇద్దరు పోలీసు కేసులు కూడా నమోదు చేశారు. దీంతో బిగ్‌బాస్‌ షో నిర్వాహకుడు అభిజిత్ ముఖర్జీ తమ షో మీద నమోదైన కేసులు కొట్టివేయాలని దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ మీద హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించి వారం రోజుల్లో కౌంటరు దాఖలు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. అంతవరకు అరెస్ట్ లాంటి చర్యలేవి చేపట్టవద్దని పోలీసులకు నిర్దేశించింది. ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 24 కి వాయిదా వేసింది. యాంకర్ శ్వేతారెడ్డి ఫిర్యాదుతో బంజారాహిల్స్ పీఎస్ లో, నటి గాయత్రి గుప్తా ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీస్‌స్టేషన్లో బిగ్‌బాస్‌ షో నిర్వాహకులపై కేసులు నమోదైన సంగతి తెలిసిందే.

ఫిర్యాదులో భాగంగా తమతో బిగ్ బాస్ కో ఆర్డినేటర్స్ అసభ్యకరంగా వ్యవహరించారని కమిట్‌మెంట్ అడిగారంటూ బిగ్ బాస్‌పై సంచలన ఆరోపణలు చేసింది శ్వేతా రెడ్డి. ఇక గాయత్రి గుప్తా సైతం.. ‘తనను సెక్స్ లేకుండా 100 రోజులు బిగ్ బాస్ హౌస్‌లో ఉంటావా?’ అని అసభ్యకరమైన మాటలతో అమర్యాదగా వ్యవహరించారని అంతే కాకుండా బిగ్ బాస్‌ షో వారి మాటల వలన తాను దబ్బూ నష్టపోయానని పోలీసులను ఆశ్రయించారు గాయిత్రీ గుప్తా.