అక్కడ మాత్రం RX స్పీడ్ లేదు..

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో RX 100 ఓ ఊపు ఊపేస్తోంది..గత వారం విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది. కేవలం ఆరు రోజుల్లో రూ. 7 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త విజయ డంఖా మోగించింది. కార్తికేయ, పాయల్ రాజపుత్‌ హీరో , హీరోయిన్లుగా రావురమేష్, సింధూర పువ్వు రామ్‌ ప్రధాన పాత్రలో నూతన డైరెక్టర్ అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ’ఆర్ఎక్స్ 100′. యూత్ కావాల్సిన బోల్డ్ రొమాన్స్ , ప్రేమకథ , మసాలా సన్నివేశాలు నిండుగా ఉండడం తో యూత్ ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు..

అయితే తెలుగు రాష్ట్రాల్లో RX స్పీడ్ బాగానే ఉన్నప్పటికీ ఓవర్సీస్ లో మాత్రం ఏ మాత్రం స్పీడ్ కొనసాగించలేకపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మాదిరే మంచి హైప్ రావడంతో దాదాపు వంద లొకేషన్లలో దీన్ని రిలీజ్ రిలీజ్ చేయడమే కాదు పెద్ద ఎత్తున ప్రిమియర్లు కూడా వేశారు. కానీ అక్కడ నామమాత్రపు వసూళ్లతో సాగిపోతోంది. ఇప్పటిదాకా అక్కడ ఈ చిత్రం లక్ష డాలర్ల దాకా వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా స్థాయికి ఇది చెప్పుకోదగ్గ మొత్తమే. కానీ దీనికి వచ్చిన హైప్.. రిలీజ్ రేంజ్ ప్రకారం చూస్తే ఇవి పెద్ద వసూళ్లేమీ కాదు. రివ్యూలు పూర్తి నెగెటివ్ గా రావడం దీనికి ప్రతికూలంగా మారినట్లుంది. అందుకే జనాలు ఈ సినిమాను చూసే సాహసం చేయడం లేదు.