బన్నీ అంటే సాయి పల్లవికి అప్పటి నుండే ఇష్టం


టాలీవుడ్‌లో ముగ్గురు అత్యుత్త‌మ డాన్స‌ర్ల లిస్టు తీస్తే.. అందులో అల్లు అర్జున్ పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. బ‌న్నీ డాన్స్ గురించి.. త‌న‌తో క‌ల‌సి న‌టించిన హీరోయిన్లంతా గొప్ప‌గా చెబుతుంటారు. బ‌న్నీకి అభిమాన గ‌ణం ఇంత‌గా పెర‌గ‌డానికి కార‌ణం.. అత‌ని నృత్యాలు కూడా. సాయిప‌ల్ల‌వి కూడా బన్నీ డాన్స్ గురించి చెప్పింది.

‘పడి పడి లేచె మనసు’ .. శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రమిది. హను రాఘవపూడి దర్శకుడు. సుధాకర్‌ చెరుకూరి నిర్మాత. ఈనెల 21న విడుదల అవుతోంది. ఈ సినిమా వేడుకలో అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సాయి పల్లవి మాట్లాడుతూ.. బన్నీకి పెద్ద అభిమానిని. స్కూల్లో ఆయన పాటలకు డ్యాన్స్‌ చేసేదాన్ని. ఆయన ఇక్కడ వుండటం ఓ గౌరవంగా భావిస్తున్నా” అని చెప్పుకొచ్చింది.