సైరా వేడిని చాణక్య తట్టుకోగలడా ?


సినిమా కి రిలీజ్ టైం చాలా అవసరం. సీజన్ , పోటీగా వుండే సినిమాలు చూసి జాగ్రత్తగా బొమ్మపడాలి. లేదంటే మంచి సినిమా కూడ గాల్లో కలసిపోయే ప్రమాదం వుంది. ఇప్పుడు గోపిచంద్ చాణక్యకి కూడా ఇదే టెన్షన్ పట్టుకుంది. రేపు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

ప్రస్తుతం సైరా హవా నడుస్తుంది. పెద్ద సినిమాకి హిట్ టాక్ వస్తే రెండు వారాల పాటు వేడి ఉటుంది. ప్రేక్షకులు మరో సినిమా వైపు చూడరు. సైరాకి కూడా హిట్ టాక్ వచ్చింది. ప్రతి ప్రేక్షకుడు ఒక్కసారైనా చూడాల్సిన సినిమా సైరా అనే మౌత్ పబ్లిసిటీ వుంది. ఇలాంటి నేపధ్యంలో చాణక్య వస్తుంది. కొంచెం తేడా కొట్టిన కష్టమే. అయితే ఇది దసరా సీజన్. రెండు సినిమాలకి ఛాన్స్ వుంది. అదీ కూడా హిట్ టాక్ ఉన్నప్పుడే. ఇప్పుడు గోపి సినిమాకి కూడా ‘బావుంది’ అనే పేరు రావాలి. లేదంటే సైరా ముందు నిలబడటం కష్టమే.