దగ్గుపాటి ఫ్యామిలీ వేడుకలో సల్మాన్..

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్..దగ్గుపాటి ఫ్యామిలీ ఫంక్షన్లో హాజరై కనువిందు చేసాడు. వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత పెళ్లి పీటలెక్కబోతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌ ఛైర్మన్‌ సురేందర్‌ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డితో ఆదివారం జయపురం లో వివాహం జరగనుంది. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి జయపురలో ప్రీ వెడ్డింగ్‌ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలో కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ హాజరయ్యారు. వెంకటేశ్‌ కుటుంబంతో కలిసి సల్మాన్‌ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఈ పెళ్లి సంగీత్‌లో నాగచైతన్య, సమంత, రానా తదితరులు డాన్సులు వేసి అలరించారు.