సామ్…కండిషన్స్ కు ఒప్పుకున్నా దిల్ రాజు..

గత ఏడాది వరుస ప్లాప్స్ చవిచూసిన దిల్ రాజు…ఈ ఏడాది మంచి బోణి కొట్టాడు. వెంకటేష్, వరుణ్ తేజ్ లతో తెరకెక్కించిన ఎఫ్ 2 చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ సాధించడమే కాదు బాక్స్ ఆఫీస్ దగ్గర కనక వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రం ఇచ్చిన సక్సెస్ జోష్ తో తదుపరి చిత్రాల ఫై ఫోకస్ పెట్టాడు. కొన్ని రోజులుగా తమిళంలో సూపర్ హిట్ అయినా 96 మూవీని దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్నాడనే వార్తలు ప్రచారం అవుతున్న సంగతి తెలిసిందే.


తాజాగా ఆ చిత్ర విశేషాలను మీడియాతో పంచుకున్నాడు. శర్వానంద్, సమంతలు ఈ సినిమాలో నటించబోతున్నారు. తమిళంలో తెరకెక్కించిన డైరెక్టరే తెలుగులో తెరకెక్కిస్తున్నారు. 96 మూవీ తెలుగు వెర్షన్ కు మార్పుచేర్పులు చేస్తున్నారట. తమిళ్ లో ఉన్నది ఉన్నట్టు తెలుగులో రీమేక్ చేస్తే ఆడడం కష్టం. ఈ సినిమా చేయడానికి అంగీకరించిన సమంత కూడా ఇదే కండిషన్ పెట్టిందట. దిల్ రాజుకు సైతం ఉన్నది ఉన్నట్టు తీయడం ఇష్టంలేదు. అందుకే సామ్ కూడా ఈ సినిమా చేయడానికి ముందుగా ఒప్పుకోలేదట. తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లే దిల్ రాజు కథ మారుస్తాననడంతో సామ్ ఓకే చెప్పినట్లు తెలుస్తుంది. మరి ఆ మార్పులు ఎలా ఉంటాయి అనేది చూడాలి.