సమంత .. బిగ్ బాస్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుందో తెలుసా..?

తెలుగు లో బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ ఫుల్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ప్ర‌స్తుతం నాగ్ వైల్డ్ డాగ్ షూటింగ్‌లో భాగంగా ‌మ‌నాలీలో ఉన్నారు. ఈ క్ర‌మంలో గత వారం సమంత చేత హోస్ట్ చేయించి బిగ్ బాస్ మంచి టిఆర్పి రేటింగ్ సాధించింది. ఆ ఎపిసోడ్‌లో ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ‌, పాయ‌ల్ రాజ్‌పుత్‌, కమెడియన్ హైప‌ర్ ఆది లాంటి సెల‌బ్రిటీలు ఆమెకు త‌మ ‌వంతు స‌పోర్ట్‌ను అందించారు. దీనితో బిగ్ బాస్ దసరా ఎపిసోడ్ బ్లాక్‌బస్టర్ హిట్ సాధించింది.

ప్రస్తుతం బిగ్ బాస్ యాజమాన్యం సమంత చేత మరో ఐదు ఎపిసోడ్స్ చేయించబోతుందట. అందుకుగానూ బిగ్ బాస్ టీమ్ ఆమెకు రూ. 2.10 కోట్లు చెల్లిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇక బిగ్ బాస్ నాలుగో సీజన్‌కు నాగార్జున రూ. 8 కోట్లు తీసుకుంటుంటే.. సమంత కేవలం మూడు వారాలకే రెండు కోట్లు పైగా పారితోషికం అందుకుంటోందట. మరి నిజంగా సమంత ఐదు ఎపిసోడ్స్ చేస్తుందా అనేది చూడాలి.