ఇక ఆ సినిమా లేనట్లే..

తెలుగులో బాహుబలి సినిమా విడుదలై..అన్ని ఇండస్ట్రీలా బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీ కలెక్షన్లు వసూళ్లు చేస్తుండడం తో వెంటనే తమిళం లో సంఘమిత్ర అనే సినిమా తెరపైకి వచ్చింది. సీనియర్ దర్శకుడు సుందర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ సినిమా ప్రకటించి దాదాపు మూడేళ్లు కావొస్తున్నా ఈ సినిమా మాత్రం సెట్స్ పైకి వెళ్లలేదు. అదిగో..ఇదిగో అంటూ సుందర్ ప్రకటనలు చేస్తున్నాడు తప్ప..సినిమా మాత్రం సెట్స్ పైకి తీసుకరావడం లేదు.

కొన్ని నెలల పాటు ఈ సినిమా గురించి ఏ సమాచారం లేకపోగా.. ఇటీవలే సుందర్ స్వయంగా ‘సంఘమిత్ర’ గురించి అప్ డేట్ ఇచ్చాడు. ఆగస్టులో ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్తుందని ప్రకటించాడు. నిర్మాణ సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. కానీ ఆగస్టు వచ్చిన కానీ ఈ సినిమా మాత్రం సెట్స్ పైకి రాలేదు. ఇక ఈ సినిమా రావడంలేదని ఇప్పుడు మరో వార్త బయటకు వచ్చింది. ఈ సినిమా పూర్తిగా ఆగిపోయిందట. ఈ సినిమా పట్ల ఎవరు కూడా పెద్దగా ఇంట్రస్ట్ చూపించడం లేదట. సుందర్ కూడా ఈ మూవీ ని పూర్తిగా పక్కకు పెట్టేసినట్లు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి. దీని బట్టి ఇక సంఘమిత్ర రావట్లే అని ఫిక్స్ అవ్వాల్సిందే.