హాస్పటల్ ‘బుజ్జిగాడు’ హీరోయిన్..అసలు ఏంజరిగిదో తెలుసా..?

ప్రభాస్ – పూరి కాంబినేషన్ లో వచ్చిన ‘బుజ్జిగాడు’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ నటి సంజనా కు సర్జరీ జరిగింది. తన అండాశయంలో పెరిగిన 550 ఎమ్‌ఎల్‌ డెర్మాయిడ్‌ని సర్జరీ చేసి తీసివేశారని సంజన ట్విట్టర్‌ ద్వారా అభిమానులకు తెలిపింది. బెంగుళూరులోని మణిపాల్‌ ఆసుపత్రిలో సర్జరీ జరిగినట్టు చెప్పుకొచ్చింది.

ప్రతి మహిళ కనీసం ఆరునెలలకొకసారి అయినా మమ్మోగ్రామ్‌ చేపించుకోవాలని, అండాశయం, గర్భాశయాలకు సంబంధించి వైద్య పరీక్షలు చేపించుకోవాలని ఈమె సూచించింది. ప్రస్తుతం తాను ఆరోగ్యం బాగానే ఉందని తెలిపింది. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో దాదాపు 45 సినిమాల్లో నటించిన సంజన…ప్రస్తుతం ఈటీవీ లో ప్రసామవుతున్న ‘స్వర్ణఖడ్గం’ సీరియల్‌లో నటిస్తోంది.