RTC క్రాస్ రోడ్స్ మహేష్ సరిలేరు అనిపించుకున్నాడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు – రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఎత్తున సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ అయినా ఈ మూవీ డే వన్ నుండి కూడా వసూళ్ల వర్షం కురిపిస్తూ బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తుంది.

హైదరాబాద్ నగరంలో ఆర్ టి సి క్రాస్ రోడ్స్ నందు మహేష్ మరో మారు తనకు తిరుగులేదని నిరూపించుకున్నాడు. సంక్రాంతి పండుగ చివరి రోజైన కనుమ నాడు సరిలేరు నీకెవ్వరు 9,06,781 రూపాయల కలెక్షన్స్ రాబట్టింది. దీనితో సరిలేరు నీకెవ్వరు ఆరు రోజులలో 99,31,157 రూపాయల గ్రాస్ రాబట్టింది. ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లో అత్యధిక మొదటి వారం కలెక్షన్స్ రాబట్టిన చిత్రంగా మూడవ స్థానంలో సరిలేరు నిలిచింది. ఇక్కడ బాహుబలి 2, సాహో మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.