ఫేక్ కలెక్షన్లు వద్దు అంటున్న డైరెక్టర్

సంక్రాంతి బరిలో వచ్చిన సినిమాలన్నీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేస్తున్నాయి. అయితే కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా చిత్రానికి మొదటి రోజు 50 కోట్ల వసూళ్లు సాదించిందంటూ ఓ అభిమాని సోషల్ మీడియాలో ప్రచారం చేయడం ఫై డైరెక్టర్ సతీష్ ఖండించారు.

వాస్తవాల్ని దాచి తప్పుడు ప్రచారం చేయాల్సిన పనే లేదని తెలిపారు. దయ చేసి ఇలాంటి రూమర్లు స్ప్రెడ్ చేయొద్దని..జెన్యూన్ రిపోర్టును…వాస్తవానికి దగ్గరగా ఉండే ఫీడ్ బ్యాక్ ను మాత్రమే ఇవ్వాల్సిందిగా అభిమానుల్ని ఆయన కోరారు.