రహస్యం కాస్త బట్టబయలు..

శర్వానంద్ – సుధీర్ వర్మ కలయికలో ఓ సినిమా తెరకెక్కుతుంది..ఈ సినిమా తాలూకా ఫస్ట్ లుక్ ను టైటిల్ ఫిక్స్ కాగానే రిలీజ్ చేస్తాం అంటూ చిత్ర యూనిట్ చెప్పుకొస్తూ వస్తుంది. ఇప్పటి వరకు ఆ టైటిల్ ఫిక్స్ చేయలేదు..గానీ రహస్యం గా ఉంచిన శర్వా లుక్ మాత్రం బయటకు లీక్ అయ్యింది. ప్రస్తుతం శర్వా గడ్డం తో ఉన్న లుక్ బయటకొచ్చి వైరల్ గా మారింది.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతోంది. ఆ షెడ్యూల్ కు సంబంధించిన పిక్స్ లీక్ అయ్యాయి. ఈ చిత్రంలో వయసు మళ్లిన డాన్ గా శర్వానంద్ కనిపించబోతున్నాడు. ఆ డాన్ లుక్ ఫుల్ గా గడ్డంతో ఉండబోతుంది. ఇప్పుడు లీకైన పిక్స్ చూస్తూనే ఆ క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనేది అర్ధం అవుతుంది. కాజల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నాడు.