బన్నీ భార్య ఏ పిక్ పోస్ట్ చేసిందో తెలుసా..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే కాదు ఆయన భార్య స్నేహ రెడ్డి సైతం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటుందనే సంగతి తెలిసిందే. బన్నీ సినిమా విశేషాలు , ఆన్ లొకేషన్ పిక్స్ , అలాగే పిల్లలు సంబందించిన పిక్స్ , విశేషాలు ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ అభిమానులను, ఫాలోయర్స్ ను ఆకట్టుకుంటుంది. తాజాగా స్నేహా రెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో అయాన్, అర్హ ఫోటోను పోస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో కొనసాగుతున్న వర్షాల దృష్ట్యా, అయాన్ మరియు అర్హా ఇద్దరూ రంగురంగుల పసుపు మరియు ఆకుపచ్చ రెయిన్ కోట్లు వేసుకుని నవ్వుతూ కనిపించడం, వారు తమ ఇంటి వద్ద పచ్చని పచ్చికలో నిలబడి ఫోటోకి పోజులివ్వడం చాలా సరదాగా ఉందని పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ మెగా అభిమానులను బాగా అలరిస్తుంది.