మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నారు..

మెగా ఫ్యామిలీ లోకి మరో నెంబర్ రాబోతున్నారు. అవును మెగాస్టార్ చిరంజీవి మరోసారి తాత కాబోతున్నట్లు సమాచారం. చిరంజీవి కూతురు శ్రీజ మరోసారి తల్లి కాబోతుంది. ఈ విషయాన్నీ శ్రీజ భర్త కళ్యాణ్ దేవ్ తెలిపి మెగా అభిమానుల్లో సంబరాలు నింపాడు. తన భార్య శ్రీజ తల్లికాబోతుందని ఆమెతో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు కళ్యాణ్ దేవ్.

#శ్రీజకళ్యాణ్‌బేబి2, #లోడింగ్ అనే హ్యాష్ ట్యాగ్‌లతో ఫొటోని షేర్ చేశారు. 2016 మార్చిలో శ్రీజ కళ్యాణ్ దేవ్‌ని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతకు ముందు శిరీష్ భరద్వాజ్‌ను ప్రేమ వివాహం చేసుకొని ఓ బిడ్డ కు జన్మనించింది శ్రీజ. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడిపోయి విడాకులు తీసుకోని , కల్యాణదేవ్ ను వివాహం చేసుకుంది.

ఇక పండగా పూట తీపి కబురు తెలియడం తో మెగా ఫ్యామిలీ సభ్యులు సైతం సంబరాలు చేసుకుంటున్నారు. ఇక కళ్యాణ్ దేవ్ ఈ మధ్యనే విజేత సినిమాతో హీరోగా పరిచమై ఆకట్టుకున్నారు.

View this post on Instagram

SreejaKalyanBaby2 #Loading . . . @sreeja_kalyan

A post shared by Kalyaan Dhev (@kalyaan_dhev) on