బాలయ్య సినిమా లో విలన్ గా చిరు తమ్ముడు..?

బాలకృష్ణ – బోయపాటి శ్రీను కలయికలో మూడో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా పూజా కార్య క్రమాలు పూర్తి చేసుకొని ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేస్తున్నాడు శ్రీను. ఇప్పటికే చిత్రంలో పలువురిని ఎంపిక చేయగా..తాజాగా విలన్ రోల్ కోసం చిరంజీవి తమ్ముడిగా చెప్పుకొనే ఫ్యామిలీ హీరో శ్రీకాంత్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీకాంత్ హీరోగా కొనసాగుతూనే క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో యుద్ధం శరణం సినిమాలో నెగెటివ్‌ రోల్‌లో నటించిన శ్రీకాంత్, ఓ మలయాళ చిత్రంలోనూ ప్రతినాయక పాత్రలో మెప్పించాడు . కానీ ఏవేవి కూడా పెద్దగా సక్సెస్ కాకపోయేసరికి శ్రీకాంత్ కు మరో ఛాన్స్ రాకుండా పోయింది. ఇప్పుడు బోయపాటి సినిమాతో ఆ బ్రేక్‌ వస్తుందన్న ధీమా తో శ్రీకాంత్ ఉన్నట్లు తెలుస్తుంది. గతంలో ఫ్యామిలీ హీరో జగపతి బాబు ను లెజెండ్ సినిమాలో పవర్ ఫుల్ విలన్ గా చూపించి జగపతి కెరియర్ నే మార్చిన శ్రీను..ఇప్పుడు శ్రీకాంత్ కు కూడా అలాంటిదే ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.